Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి కుక్క కరిచిందనీ తుపాకీతో కాల్చిపారేసిన ఎస్ఐ...

ఇటీవలి కాలంలో శునకాలపై ప్రతాపం చూపించే వారి సంఖ్య అధికమైంది. మొన్నటికిమొన్న చెన్నైలో ఇద్దరు మెడికోలు ఓ కుక్కను బహుళ అంతస్తు భవనంపై నుంచి కిందికి విసిరి దాన్ని వీడియో తీస్తూ పైశాచికానందం పొందారు. ఆ తర్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (15:21 IST)
ఇటీవలి కాలంలో శునకాలపై ప్రతాపం చూపించే వారి సంఖ్య అధికమైంది. మొన్నటికిమొన్న చెన్నైలో ఇద్దరు మెడికోలు ఓ కుక్కను బహుళ అంతస్తు భవనంపై నుంచి కిందికి విసిరి దాన్ని వీడియో తీస్తూ పైశాచికానందం పొందారు. ఆ తర్వాత మరో ప్రాంతంలో ఇద్దరు యువకులు ఓ కుక్క కాళ్లు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టారు. 
 
ఈ రెండు సంఘటనలు మరువకముందే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి ఆగ్రహానికి ఓ శునకరాజా బలైంది. కాలు కరవడంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ... దానిని కాల్చిపారేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిన్హట్‌లో జరిగింది. 
 
చిన్హట్‌కు చెందిన ఎస్ఐ మహేంద్ర ప్రతాప్ బరాబంకీలో విధులను నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో అతడిని ఒక వీధి కుక్క కరిచింది. అంతే, రెచ్చిపోయిన ఆయన తన ఇంట్లో ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని తీసుకువచ్చి ఆ కుక్కను కాల్చిపారేశాడు. అయితే, ఈ సంఘటనపై జంతు ప్రేమికులు, జంతు హక్కుల ఉద్యమకారులు మండిపడుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments