Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నచేప... ఆ జాలరి ప్రాణం తీసింది.. ఎలాగో తెలుసా?

వలలో చిక్కిన చిన్న చేపే కదా అని నోట్లో కొరికాడు. అంతే ఈ చిన్న చేపే ఆ జాలరి మృతికి కారణమైంది.. ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా, సిద్ధ లింగ

Webdunia
సోమవారం, 21 మే 2018 (11:18 IST)
వలలో చిక్కిన చిన్న చేపే కదా అని నోట్లో కొరికాడు. అంతే ఈ చిన్న చేపే ఆ జాలరి మృతికి కారణమైంది.. ఎలాగో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా, సిద్ధ లింగమఠం గ్రామపు చెరువులో చేపలు పట్టేందుకు ఆరుంగురికై గ్రామానికి చెందిన అన్నామలై ఆదివారం చేపలు పట్టేందుకు జాలర్లతో కలిసి వెళ్లాడు. 
 
అన్నామలై వలలో ఓ చేప చిక్కింది. ఆ చేప వల కొసభాగంలో ఇనుప ముల్లుకు చిక్కుకుంది. దానిని వల నుంచి తీయాలనుకున్న అన్నామలై ఆ చేపను నోటితో పట్టుకుని వల కొసను బలంగా లాగాడు. కానీ అనూహ్యంగా ఆ చేప అన్నామలై నోట్లోకి చేరి... గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో, ఊపిరాడక పోవడంతో అన్నామలై ఇబ్బంది పడ్డాడు.
 
మిగిలిన జాలర్లు అన్నామలైని ఆస్పత్రికి తరలించినా.. గొంతులో ఇరుక్కుపోయిన చేపను బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తుండగానే అన్నామలై మరణించాడు. ఈ ఘటన తిరుక్కోలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments