Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూస్టర్ డోస్ ధర రూ.250 - సర్వీస్ చార్జి రూ.150 అధికం

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (12:09 IST)
కరోనాపై సాగిస్తున్న పోరులో భాగంగా ఇపుడు బూస్టర్ డోస్ అందుబాటులోకి వచ్చిది. ఈ బూస్టర్ డోస్ ధర రూ.250 కాగా, సర్వీస్ చార్జి కింద రూ.150 అదనంగా చెల్లించాల్సివుంటుంది. ఈ బూస్టర్ డోస్ (ప్రికాషనరీ టీకా) పంపిణీ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభమైంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు. 
 
"ప్రధాని నరంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిపై చేస్తున్న యద్ధంలో భాగంగా ఎన్నో రకాలైన చర్యలను తీసుకుంటుంది. ఇందులోభాగంగా, ఆదివారం నుంచి 18 యేళ్ల పైబడిన వారికి ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అందువల్ల 18 యేళ్లు పైబడినవారందరూ ముందుకు వచ్చి ఈ ప్రికాషనరీ డోస్‌ను వేసుకుని కరోనాపై విజయం సాధించేందుకు సహకరించాలని ఆయన కోరారు. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ వెలుగు చూసింది. దీంతో ప్రికాషనరీ డోస్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటివరకు కరోనా టీకాలను దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేశారు. కానీ ప్రికాషనరీ టీకాలను మాత్రం ప్రభుత్వం ఉచితంగా వేయడం లేదు. ఈ టీకు డబ్బులు ప్రజలే చెల్లించాల్సి ఉంటుంది. కావాగ్జిన్, కోవిషీల్డ్ ప్రికాషరీ డోస్ ధర రూ.250 కాగా, టీకా ఇచ్చినందుకు సర్వీస్ చార్జి కింద రూ.150 చెల్లించాల్సివుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments