Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిలేనివారిని ఆహ్వానించి రాజ్‌భవన్‌ను కాఫీ షాపుగా మార్చేశారు.. : మంత్రి పొన్నుడి

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (13:52 IST)
పనిలేని వారిని ఆహ్వానించి రాజ్‌భవన్‌ను కాఫీషాపుగా మార్చివేశారంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవిపై తమిళనాడు ఉన్నత విద్యాశాఖామంత్రి పొన్ముడి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో ఓ ఆర్మీ జవాను అధికార డీఎంకే కౌన్సిలర్, ఆయన అనుచరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీన్ని సాకుగా పెట్టుకుని గవర్నర్‌ను కలిసిన తమిళనాడు బీజేపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ ఆర్.ఎన్.రవి తన ట్విట్టర్ వేదికగా జవాన్ హత్యపై స్పందించారు. ఆర్మీ జవాను ప్రభు హత్య "తీవ్ర ఆందోళన కలిగించే అంశం" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
దీనికి రాష్ట్ర మంత్రి డాక్టర్ పొన్ముడి ఘాటుగానే రిప్లై ఇచ్చారు. "పనిలేనివారిని ఆహ్వానించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం ద్వారా రాజ్‌భవన్‌ను కాఫీ షాపుగా మార్చడం గవర్నర్ పని కాకూడదు" అని అన్నారు. "ఓ రాజకీయ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు చేసిన అభ్యర్థనను ప్రచురిస్తున్న రాజ్‍భవన్ ఆన్‌లైన్.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ తయారు చేసిన ముసాయిదా బిల్లు రాజ్‌భవన్‌లో ఏ స్థితిలో ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తుందా? ఇతర పెండింగ్‌ బిల్లుల గురించి వారికి చెబుతుందా? అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments