Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను హాట్ ఎమ్మెల్యేనా...? టెక్ భారత్ మెంటల్‌గా ఎదగలేదు... అంగూర్ లతా ఫైర్... మరి ఆ ఫోటోలేంటి లతా...?

టెక్నికల్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగిన భారతదేశం మానసికంగా మాత్రం ఇంకా ఎదగలేదని కొత్తగా అసోంలో భాజపా తరపున గెలిచిన ఎమ్మెల్యే అంగూర్ లతా మండిపడ్డారు. ఐతే ఈ విమర్శ ఆమె నెట్టింట్లో జోడించిన కొద్దిసేపటికే... మీరు మాత్రం ఓ రాజకీయ నాయకురాలిగా ఇంకా ఎదగాల్సింది చాల

Webdunia
మంగళవారం, 24 మే 2016 (16:27 IST)
టెక్నికల్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగిన భారతదేశం మానసికంగా మాత్రం ఇంకా ఎదగలేదని కొత్తగా అసోంలో భాజపా తరపున గెలిచిన ఎమ్మెల్యే అంగూర్ లతా మండిపడ్డారు. ఐతే ఈ విమర్శ ఆమె నెట్టింట్లో జోడించిన కొద్దిసేపటికే... మీరు మాత్రం ఓ రాజకీయ నాయకురాలిగా ఇంకా ఎదగాల్సింది చాలా ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యమంగా రాజకీయ నాయకులు ఎవరెన్ని అన్నప్పటికీ, ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ తట్టుకుని చాలా కూల్ గా ఉంటారు. అలాంటిది ఒక్క మాటకే ఇంతలా ఫైర్ అయితే ఎలా అంగూర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఇంతకీ అంగూర్ కోపానికి కారణం ఏంటయా అంటే... తను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అంతర్జాలంలో ఆమె హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హాట్ ఎమ్మెల్యే అంటూ కథనాలు చొప్పించారు. దీనిపై అంగూర్ స్పందిస్తూ... తనకు అందం దేవుడిచ్చిన వరమని చెప్పుకొచ్చారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన ఆమె తనను హాట్ ఎమ్మెల్యే అని సంబోధించడంపై మాట్లాడుతూ... టెక్నాలజీ పరంగా ఎదిగిన భారత్ మానసికంగా మాత్రం ఎదగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
దయచేసి తనను హాట్ ఎమ్మెల్యే అని సంబోధించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి ఆమె హాట్ హాట్ గా నటించిన చిత్రాలు మాత్రం ఇప్పుడు అసోంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రదర్శనకు బాక్సులతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి అంగూర్ లతా రాజకీయాల ద్వారా మంచి పబ్లిసిటీనే తెచ్చుకున్నట్లు కనబడుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments