Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ మరణం.. తమిళ రాజకీయాల్లో మార్పులు.. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్

దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాజకీయాల్లో క్రమక్రమంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘అమ్మ’ మరణంతో కరుణానిధి వర్సెస్ జయలలిత రాజకీయాలకు ఇప్పటికే తెరపడింది. ప్రస్తు

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (11:10 IST)
దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాజకీయాల్లో క్రమక్రమంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘అమ్మ’ మరణంతో కరుణానిధి వర్సెస్ జయలలిత రాజకీయాలకు ఇప్పటికే తెరపడింది. ప్రస్తుతం డీఎంకేలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ ఎన్నికయ్యారు. జయలలిత మృతితో తమిళనాడు రాజకీయాల్లో శూన్యం ఏర్పడినట్లు భావిస్తున్న నేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది
 
బుధవారం చెన్నైలోని అన్నా అరివాలయంలోని కలైజ్ఞర్‌ అరంగంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతేగాకుండా ప్రతిపక్షనేత, కోశాధికారిగా కూడా స్టాలిన్ కొనసాగనున్నారు. తాజా నిర్ణయంతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పార్టీ పగ్గాలు ఇప్పుడు స్టాలిన్‌కు అందాయి. పార్టీ కురువృద్ధుడు కరుణానిధి ఇప్పటివరకు పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments