Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. మోడీ వ్యాఖ్యలు అర్థం చేసుకోండి.. ''సోమాలియా''పై రచ్చ వద్దు: శ్రీశాంత్

Webdunia
శనివారం, 14 మే 2016 (18:38 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళను సోమాలియాతో పోల్చి వివాదాన్ని కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలపై కేరళలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ బీజేపీలో చేరి రాజకీయ నేతగా మారిపోయిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మోడీకి మద్దతు పలుకుతూ కామెంట్స్ చేశారు. నరేంద్ర మోడీ లేవనెత్తిన అంశం చాలా సున్నితమైందని.. దాన్ని అర్థం చేసుకోకుండా కేరళను సోమాలియాతో పోల్చారని మోడీపై విమర్శలు గుప్పించడం సబబు కాదని శ్రీశాంత్ వ్యాఖ్యానించారు. 
 
కేరళ మొత్తాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమాలియాతో పోల్చలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలని శ్రీశాంత్ అన్నారు. అందుచేత మోడీకి తాను మద్దతిస్తానన్నారు. కేరళలోని దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో శిశుమరణాల రేటు అధికంగా ఉందని.. అది సోమాలియా తరహాలో ఇక్కడ కూడా పెద్ద సమస్యగా పరిణమించిందని శ్రీశాంత్ గుర్తుచేశారు. అసలు సంగతిని అర్థం చేసుకోకుండా మోడీ వ్యాఖ్యలను పలువురు తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళలో ఎన్నికల ప్రచార సందర్భంగా శ్రీశాంత్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
 
కాగా నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కేరళ సీఎం ఉమెన్ చాందీ కూడా తప్పుబడుతూ సోషల్ మీడియాలో స్పందించిన సంగతి తెలిసిందే. మోడీ వ్యాఖ్యలకు ఇలా సోషల్ మీడియా వస్తున్న వ్యతిరేకతకు స్టార్ పొలిటికల్ లీడర్ శ్రీశాంత్ బ్రేక్ వేసేలా కామెంట్స్ చేస్తూ ప్రధానికి మద్దతు పలకడం గమనార్హం. కేరళలో సోమవారం ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు మే 19న విడుదల కానున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments