అందమైన భార్య... అద్భుతమైన భవంతి... కానీ...

అందమైన భార్య. అద్భుతమైన భవంతి. కావాల్సినంత సంపద. అన్నీ వున్నా ఆ బాబా అలా ఎందుకు చేసినట్లు? ఆయన ఓ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. ఆయన సేవలకు మెచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని ఇస్తామని కమలనాథులు కబురు పంపారు. అయితే, తనకు మంత్రి పదవి వద్దని

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (22:57 IST)
అందమైన భార్య. అద్భుతమైన భవంతి. కావాల్సినంత సంపద. అన్నీ వున్నా ఆ బాబా అలా ఎందుకు చేసినట్లు? ఆయన ఓ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. ఆయన సేవలకు మెచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని ఇస్తామని కమలనాథులు కబురు పంపారు. అయితే, తనకు మంత్రి పదవి వద్దని తెగేసి చెప్పారు. అలా చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతకీ ఆయన ఎవరన్నదే కదా మీ సందేహం.
 
ఆయన ఎవరో కాదు.. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్. ఊరు ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈయన మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలోనే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తుపాకీ శబ్దంతో షాక్‌కు గురైన ఆయన శిష్యులు భయ్యూజీ గదిలోకి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో హుటాహుటిన స్వామిజీను ఇండోర్‌ బాంబే ఆసుపత్రికి తరలించారు. భయ్యూజీని పరీక్షించిన వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. తను తీవ్రమైన ఒత్తిడికి లోనయినట్లు ఓ లేఖ రాసిపెట్టారు.
 
గత ఏప్రిల్ నెలలో భయ్యూజీకి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రి పదవిని ఆఫర్‌ చేసింది. అయితే, దాన్ని భయ్యూజీ తిరస్కరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు పదవులు అక్కర్లేదని తెగేసి చెప్పారు కూడా. ఇంతలోనే ఈ విషాదకర నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments