మా నాన్న ప్రజల మనిషి.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఓకే: సౌందర్య రజనీకాంత్

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. రజనీకాంత్ తన పుట్టినరోజు డిసెంబర్‌ 12న కొత్తపార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ ఇప్పటిక

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (17:52 IST)
తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. రజనీకాంత్ తన పుట్టినరోజు డిసెంబర్‌ 12న కొత్తపార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ ఇప్పటికే తన అభిమానులతో సుదీర్ఘంగా సమావేశమైనట్లు టాక్ వస్తోంది. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ కూడా విజ్ఞప్తి చేశారు. అయితే దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయన కూడా చెప్పారు.
 
రజనీకాంత్‌ అభిమానులను కలుసుకున్న తరువాత ఆయన రాజకీయం సెగ మరింత పెరిగింది. అభిమానుల భేటీ అనంతరం రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారంటూ ఆయన సోదరుడు కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రజనీ పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం 
 
మరోవైపు రజనీకాంత్‌, ఆయన సలహాదారులు పార్టీలోకి ప్రముఖ నేతల వలసలపై దృష్టి పెట్టారు. ఇతర పార్టీల్లోని పేరొందిన సీనియర్‌ రాజకీయ నాయకులను తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీని పటిష్టపరచాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రజ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డానికి త‌మ కుటుంబం ఎప్పుడూ అండ‌గానే ఉంటుంద‌ని ఆయ‌న చిన్న కూతురు సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ తెలిపింది. తండ్రిగారైన రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... అందుకు తమ మద్దతు ఉంటుందని.. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి అన‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదని సౌందర్య తెలిపింది.
 
నిజానికి త‌మిళ‌నాడులో ఉన్న డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే అనే రాజకీయ పార్టీ ర‌జ‌నీకాంత్ రాక కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు త‌మిళనాడులో గొప్ప‌ పేరు ఉన్న మ‌రో న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ సోష‌ల్ మీడియాలో త‌మిళ రాజ‌కీయాల గురించి రోజుకో ర‌క‌మైన పోస్ట్ చేస్తున్నారు. దీంతో కమల్ కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారని టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments