Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంతకాలం మా కుటుంబాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు : ఎస్పీజీ చీఫ్‌కు సోనియా లేఖ

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (09:04 IST)
ఇంతకాలం మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడినందుకు ధన్యవాదాలు అంటూ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) చీఫ్‌ అరుణ్ సిన్హాకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ప్రముఖ నాయకులకు కల్పించే వ్యక్తిగత భద్రతపై ఐదేళ్లకోసారి జరిపే సమీక్షలో కేంద్రం ఎస్పీజీ భద్రతను ఇటీవల తొలగించింది. ఈ నేపథ్యంలో సోనియా, ఎస్పీజీ చీఫ్ అరుణ్ సిన్హాకు లేఖ రాశారు. అంకిత భావంతో 28 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి కల్పించిన భద్రత పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
 
'ఎస్పీజీని కేటాయించినప్పటి నుంచి మా కుటుంబం సురక్షితంగా ఉంది. అది మావెంట ఉండటంతో మా బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించగలిగాం. ఎస్పీజీ అద్భుతమైన దళం. బలగాలకు దేశభక్తితోపాటు, పనిని ఖచ్చితంగా నిర్వహించే సామర్థ్యముంది. మా కుటుంబానికి అంకితభావంతో రక్షణ కల్పించినందుకు ప్రశంసిస్తున్నా' అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు కల్పిస్తూ వచ్చిన ఎస్పీజీ రక్షణ విభాగాన్ని తొలగించి, ఇకపై వంద మందితో కూడిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments