Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సోనియా - ఐదుగురితో కమిటీ

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (13:08 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమిపై పార్టీ విశ్లేషణ చేస్తుంది. పరాభవానికి గల కారణాలను అన్వేషించి, లోపాలను చక్కదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేపట్టారు. వచ్చే 2024 నాటికి పార్టీని పటిష్టం చేసే దిశగా ఆమె నడుం బిగించారు. ఇందులోభాగంగా, తొలుత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను ఆమె తప్పించారు. 
 
ఆ తర్వాత పార్టీ ఓటమి విశ్లేషణ కోసం ఐదుగురు సీనియర్ నేతలను రంగంలోకి దించారు. ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థిలను విశ్లేషించి, సంస్థాగతంగా చేయాల్సిన మార్పులనూ ఈ కమిటీ సూచన చేస్తుంది. ఇందులోభాగంగా, పార్టీ సీనియర్ నేత అజయ్ మకెన్‌‌కు పంజాబ్ బాధ్యతలను అప్పగించింది. 
 
అలాగే, మణిపూర్ బాధ్యతలను జైరామ్ రమేష్, గోవాకు రజిని పాటిల్, ఉత్తరప్రదేశ్‌కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్‌కు అవినాష్ పాండేలను నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడి, వారి నుంచి సమాచారం సేకరించి, వాస్తవ పరిస్థితులతోపాటు సంస్థాగతంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై వారు నివేదిక అందచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments