Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేటకొడవలితో నరుకుతుంటే భార్య పారిపోయింది...

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (10:59 IST)
మేఘాలయ రాష్ట్రానికి హనీమూన్‌ కోసం వెళ్లిన నవ దంపతుల్లో వరుడు హత్యకు గురైన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ హత్య కేసులో మృతుడు భార్య, నవ వధువు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడే ప్రధాన సూత్రధారులుగా తేలింది. అయితే, తన కళ్లముందు కిరాయి ముఠా సభ్యులు వేటకొడవలితో నరుకుతుంటే భార్య సోనమ్ అక్కడ నుంచి పారిపోయింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. అదేసమయంలో మేఘాలయలో పోలీసులు ఈ హత్యలో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చసారు. అలాగే, ఈ హత్యకు వాడిన రెండో వేట కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హత్య కేసులో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు మంగళవారం సోనమ్ సహా నిందితులందరినీ షిల్లాంగ్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహ్రాకు తీసుకెళ్లి నేరం జరిగిన తీరును పునఃసృష్టించారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసుల కథనం మేరకు.. కిరాయి హంతకుల్లో ఒకటైన విశాల్ సింగ్ చౌహాన్, రాజాపై తొలుత వేటకొడవిలో దాడి చేశాడు. రాజాకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో నొప్పితో కేకలు వేయడం మొదలుపెట్టగానే సోనమ్ అక్కడి నుంచి పరుగులు తీసింది. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలోనే రాజా హత్యకు ఉపయోగించిన రెండో వేటకొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఒకే ఆయుధంతో హత్య జరిగిందని భావించినప్పటికీ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ తర్వాత రెండో ఆయుధం వాయిడినట్టు నిర్దారణ అయింది. 
 
ఈ దారుణ ఘటనపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందిస్తూ, తమ కుటుంబానికి సోనమ్‌తో ఇకపై ఎలాంటి సబంధాలు లేవని ప్రటించారు. రాజా కుటుంబానికి న్యాయం జరిగే పోరాటంలో తాము అండగా ఉంటామని ఈ ఘటన తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments