Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనాలీ ఫోగట్‌కు సింథటిక్ డ్రగ్ : గోవా ఐడీ ఓంవీర్ సింగ్

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (19:37 IST)
బీజేపీ మహిళా నేత, సినీ నటి సోనాలీ ఫోగట్‌కు కర్లీస్ క్లబ్ ఓ సింథకిట్ డ్రగ్ ఇచ్చారని గోవా ఐజీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. సోనాలికి ఇచ్చింది ఓ సింథటిక్ డ్రగ్ అని చెప్పారు కానీ, ఆ డ్రగ్ పేరు మాత్రం వెల్లడించలేదని పేర్కొన్నారు. ఆ పదార్థాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సోనాలీ ఫోగట్‌తో కలిసి ఆమె అనుచరులైన సుధీర్ సాంగ్వాన్, సుఖ్విందర్ వసీలు కలిసి కర్లీస్ క్లబ్‌కు చేరుకున్నారని, అక్కడ సోనాలీతో బలవంతంగా డ్రగ్ తాగించినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెల్లడైందన్నారు. 
 
ఈ వీడియో ఆధారంగా సుధీర్‌, సుఖ్వీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు. అపుడు సోనాలీకి ఇచ్చిన డ్రింక్‌లో రసాయనం కలిపినట్టు అంగీకరించారని ఐజీ వెల్లడించారు. ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకోగానే వారు ఆమెను మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి అక్కడే రెండు గంటల పాటు ఉన్నారని, అక్కడ ఏం జరిగిందో వారు బయటపెట్టలేదని చెప్పారు. విచారణ సాగే కొద్ది మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
సోనాలీది సహజ మరణం కాదు.. 
భారతీయ జనతా పార్టీ మహిళా నేత, నటి సోనాలి ఫోగట్ (43)ది సహజ మరణం కాదని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో సోనాలి హత్య కేసులో ఆమె ఇద్దరు సహాయకులను గోవా పోలీసులు అరెస్టు చేశారు. సోనాలీ శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలడంతో ఆమె ఇద్దరు సహాకులైన సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 
 
సోనాలి హత్యపై ఆమె సోదరుడు రింకు ఢాకా బుధవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వీరిద్దరి పేర్లను పేర్కొన్నాడు. దీంతో అనుమానాస్పద నిందితులుగా భావించి వారిద్దరిన గోవా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
కాగా, ఈ నెల 22వ తేదీన సోనాలి గోవాకు వచ్చిన సమయంలో వీరిద్దరు ఆమెతోనే ఉన్నారు. ఆ తర్వాత రోజు ఉదయం అపస్మారకస్థితిలో పడివున్న సోనాలీని గుర్తించి ఉత్తర గోవా జిల్లాలోని సెంయింట్ ఆంథోనీ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. 
 
అయితే, ఆమె గుండెపోటు కారణంగా మరణించివుంటుందని తొలుత వైద్యులు భావించారు. కానీ, మృతదేహానికి జరిపిన అటాప్సీ పరీక్షలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో సోనాది ఫోగట్‌ది సహజమరణం కాదని హత్యేనని వైద్యులు తేల్చారు. 
 
దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 42 యేళ్ళ సోనాలీ భర్త గత 2016లో చనిపోగా, ఆమెకు 15 యేళ్ళ కుమార్తె ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments