Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు బయలుదేరిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:22 IST)
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ మహిళా స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైంది. అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి. మోహన్‌రావు కుమార్తె భరణి(26) బెంగళూర్‌లోని ఓ కంపెనీలో కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 
 
అక్టోబర్ 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజీబీఎస్‌లో బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లారు. తర్వాత భరణికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాప్ చేయబడి ఉంది. తర్వాత రోజు ఆయన భరణి పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా ఆమె రాలేదని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. 
 
దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు, మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments