Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ చేయడం మర్చి నిద్రపోయింది.. మెలకువ వచ్చి చూస్తే... నగ్నంగా పరుపుపై మగాడు

నేరం చేయడానికి ప్రతి చిన్న అవకాశం కోసం నేరస్తులు కాచుక్కూచునే ఉంటారు . ఈ విషయం గమనించని యువతులు చిన్న పొరపాటు చేస్తే నేరం వారి ఇంటి తలుపే తడుతుంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోందీ ఘటన. పొరపాటున తలుపు వేయడం మర్చి నిద్రపోయిన ఆ ఢిల్లీ యువతికి జీవితం

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (03:42 IST)
నేరం చేయడానికి ప్రతి చిన్న అవకాశం కోసం నేరస్తులు కాచుక్కూచునే ఉంటారు . ఈ విషయం గమనించని యువతులు చిన్న పొరపాటు చేస్తే నేరం వారి ఇంటి తలుపే తడుతుంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోందీ ఘటన. పొరపాటున తలుపు వేయడం మర్చి నిద్రపోయిన ఆ ఢిల్లీ యువతికి జీవితంలో ఇక తలుపు వేయడం మర్చిపోలేనంత గట్టి గుణపాఠం ఎదురైంది. విషయం ఏమిటంటే.. గ్రేటర్ నోయిడా ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు. యువతి వేగంగా స్పందించి అలారమ్ ఆన్ చేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. 
 
గ్రేటర్ నోయిడాలోని ఏవీజే హైట్స్ వద్ద 11 భవనాలు ఉన్నాయి. 1800 ఫ్లాట్స్ ఉండగా, వాటిలో ఓవరాల్‌గా 1100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 25 ఏళ్ల యువతి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తూ ఇక్కడి ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఫ్లాట్‌కి వెళ్లిన తర్వాత డోర్ లాక్ చేయడం మరిచిపోయి నిద్రపోయింది. ఆమె కదలికలు గమనించిన సెక్యూరిటీ గార్డ్ రాజ్ కుమార్ చుట్టుపక్కల ఫ్లాట్ల డోర్లు లాక్ చేశాడు. ఆపై రాజ్ కుమార్ యువతి ఫ్లాట్‌లోకి ప్రవేశించి అన్ని తలుపులకు గడియ పెట్టాడు. బెడ్రూమ్‌లో వెళ్లి నిద్రిస్తున్న యువతిని రేప్ చేసేందుకు సిద్ధపడ్డాడు. 
 
ఇంతలో అలికిడి విని లేచిన యువతి నగ్నంగా మారుతున్న సెక్యూరిటీ గార్డ్ ను చూసి షాక్‌కు గురైంది. పారిపోయేందుకు యత్నించగా ఆమెను గట్టిగా పట్టుకుని బెడ్ మీదకు లాక్కున్నాడు. అతడి భారి నుంచి తప్పించుకుని వెంటనే ఫ్లాట్ అలారమ్ ను మోగించింది. కిటికీ తెరచి నన్ను కాపాడండి.. అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఏం చేయాలో అర్థంకాని రాజ్ కుమార్ వెనక వైపు డోర్ తెరుచుకుని పరారయ్యాడు. గత మే31న అల్మారా లాక్ ప్రాబ్లం ఉందని సెక్యూరిటీ గార్డ్ సాయం కోరింది. ఆ రోజు నుంచి ఆమె కదలికల్ని గమనించిన రాజ్ కుమార్ యువతిపై ఆశ పెంచుకుని ఈ అఘాయిత్యానికి యత్నించాడని పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments