Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్నాథ్‌లో మంచు తఫాను : బాధితుల్లో మాజీ సీఎం, ఓ ఎంపీ

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చిన యాత్రికులు, భక్తులు మంచు తుఫానులో చిక్కుకుని పోయారు. వీరిలో మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ ప్రదీప్‌

Webdunia
బుధవారం, 9 మే 2018 (11:34 IST)
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చిన యాత్రికులు, భక్తులు మంచు తుఫానులో చిక్కుకుని పోయారు. వీరిలో మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ ప్రదీప్‌లు కూడా ఉన్నారు.
 
దీనిపై రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గౌరికుంద్‌కు వెళ్లే దాదాపు 4,200 మంది యాత్రికులు మంచు తుఫాను కారణంగా కేదార్నాథ్‌లో చిక్కుకుపోయారని, వీరిలో 400 మందికి పైగా వృద్ధులు ఉన్నారని తెలిపారు. 
 
అయితే, వీరందరినీ సురక్షితంగా రక్షించేందుకు స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ జవాన్లు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఐదు ఇంచుల మేర మంచు కురుస్తుండటంతో హెలికాప్టర్ సేవలు, యాత్రికుల కదలికలు నిలిచిపోయాయని తెలిపారు. 

అలాగే, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న మంచు తుఫానులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మితో పాటు పలువురు జెడ్పీటీసీలు చిక్కుకున్నారు. ఉపాధి హామి పనుల అమలు తీరును పరిశీలించేందుకు వీరంతా గత వారంలో ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. చార్‌ధామ్ సమీపంలోని సీతాపురి ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మంచు తుఫానులో వీరంతా చిక్కుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments