Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమ శిఖరం నుంచి లోయలో పడ్డట్టయింది... స్నాప్ డీల్ తహతహలాడుతోందట...

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (22:03 IST)
నోరు జారితే తిరిగి తీసుకోవడం చాలా కష్టమని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మాటల వల్ల సజావుగా సాగిపోతున్న జీవితంలో సుడిగుండాలు చెలరేగుతాయి. కెరీర్ పరంగా సర్వనాశనమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి స్థితిలో ఇప్పుడు అమీర్ ఖాన్ ఉన్నాడు. అసహనం పైన ఆయన తన భార్య అలా అంటుందని చెప్పినందుకు ఆయన ప్రతిష్ట భారతదేశంలో క్రమక్రమంగా మసకబారిపోతోంది. ఇప్పటికే ఇంక్రెడిబుల్ ఇండియా నుంచి తప్పించేశారు. 
 
ఇక ప్రైవేట్ కంపెనీలతో ఉన్న బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారయ్యాయంటున్నారు. అమీర్ ఖాన్ తో స్నాప్ డీల్ కుదుర్చుకున్న ఒప్పందం, అసహనం అంటూ అమీర్ చేసిన వ్యాఖ్యల టైంలో భారీగా నష్టాలను చవిచూసింది. ఆయన బొమ్మ కనబడితే చాలు స్నాప్ డీల్ లాగిన్ అవుట్ అవుతూ షాకిచ్చారు. దీనితో ఇప్పుడు అమీర్ ఖాన్ ఎలాగోలా వదిలించుకోవాలని స్నాప్ డీల్ చూస్తోందట. ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం కాలం ఎపుడు పూర్తవుతుందా అని తహతహలాడుతోందట. 
 
ఇలా ఒక్కొక్కటిగా అవకాశాలన్నీ చేజారిపోతుండగా త్వరలో విడుదల కాబోయే చిత్రాన్ని కూడా చూడవద్దంటూ కొంతమంది పనిగట్టుకుని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టు చేస్తున్నారట. దంగల్ సినిమాను చూడవద్దంటూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఇక అమీర్ ఖాన్ కెరీర్ పతనావస్థకు చేరుకుందా అనే కామెంట్లు వినబడుతున్నాయి. మొన్నటివరకూ హిమ శిఖరం అంత ఎత్తున కనబడిన అమీర్ గ్రాఫ్ ఒక్కసారిగా లోయల్లోకి పడిపోయినట్లయిందంటున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments