పడకగదిలో దంపతుల శృంగారం... ఆ సైట్‌లో వీడియో.. ఎలా సాధ్యం..?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (10:16 IST)
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలతో తలనొప్పి తప్పేలాలేదు. కోల్‌కతాలోని ఓ జంట తమ ఇంట్లోని పడకగదిలో శృంగారం చేస్తున్న దృశ్యాలు పోర్న్ సైట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆ జంటకు షాక్ తప్పలేదు. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో పోలీసులు విస్తుపోయే నిజం చెప్పారు.

వివరాల్లోకి వెళ్లితే.. భర్త తన ఫోన్‌లో పోర్న్ సైట్ చూస్తున్నాడు. అందులో అతడికి ఒక వీడియాలో తమ బెడ్ రూమ్‌లో తమ భార్యభర్తల శృంగారానికి సంబంధించిన వీడియోగా గుర్తించాడు. దీంతో షాక్ తిన్న అతడు వెంటనే ఇంట్లోని బెడ్ రూమ్ ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా అని అంతా వెతికాడు. ఫలితం లేకపోవడంతో మరోదారి లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
 
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వారి గదిలో స్మార్ట్ టీవీ ఉంది. అందులో ఇన్ బిల్ట్ కెమెరా ఉంది. ఆ టీవీ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉంది. దీంతో స్మార్ట్ టీవీని విదేశాల్లోని హ్యాకర్లు ఆన్ లైన్ ద్వారా హ్యాక్ చేశారని సైబర్ నిపుణులు గుర్తించారు. టీవీలో ఉన్న కెమెరా సాయంతో దంపతులు కలిసున్న విజువల్స్‌ని హ్యాకర్ రికార్డ్ చేశాడని, ఆ తర్వాత దాన్ని పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడని గుర్తించారు. 
 
ఈ వార్త బాధిత దంపతులనే కాదు.. ఇళ్లలో ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ టీవీలు ఉండే అందరిని కలవరానికి గురి చేసింది. ఈ ఘటన నేపథ్యంలో సైబర్ నిపుణుల కీలక సూచనలు చేశారు. అవసరం లేని సమయంలో ల్యాప్ ట్యాప్, స్మార్ట్ టీవీల కెమెరాలకు స్టిక్కర్ అంటించుకోవడం మంచిదని సూచించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వైఫై పాస్ వర్డ్స్ మార్చుకోవాలని, పడుకునే ముందు కచ్చితంగా వైఫై ఆఫ్ చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం