Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు పుట్టలేదా..? సెలవుల జాబితా చూస్తే?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:06 IST)
ఉద్యోగులు విద్యార్థులకు ఉత్తరప్రదేశ్‌లో ఎందుకు పుట్టలేదా? అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు సెలవు రాజకీయాలు నడిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అత్యధిక సెలవులు ఇస్తున్న రాష్ట్రంగా ఉన్న యూపీ, మరిన్ని రోజులను సెలవు దినాల్లో చేర్చింది. దీంతో ఇకపై ఉద్యోగులు ఆరు నెలలు సెలవులు అనుభవించి, ఆరు నెలలు పనిచేస్తే చాలు. 
 
వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఉద్యోగ వర్గాల మెప్పుకోసం అఖిలేష్ యాదవ్ మరో మూడు సెలవులను అదనంగా కలిపారు. మాజీ ప్రధానమంత్రులు చరణ్ సింగ్, చంద్రశేఖర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ల జయంతి ఉత్సవాలను సెలవులుగా నిర్ణయించారు. వీరందరి జన్మదినోత్సవాలను జరుపుకోవడం వల్ల ప్రజలు వీరిని ఆదర్శంగా తీసుకోగలుగుతారని ప్రభుత్వం వెల్లడించింది. 
 
ఇక ఇప్పుడు యూపీలో సెలవుల జాబితా 38కి పెరిగింది. ఇప్పటికే వారంలో ఐదు రోజుల పాటు మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎల్, ఈఎల్, పండగ సెలవులు తదితరాలన్నీ కలిపితే వారు పనిచేసే కాలం ఆరు నెలలకు తగ్గుతుంది. అదీ సంగతి మరి.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments