Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ సిద్ధరామయ్యా.. ఈ నాన్సెన్స్ ఏమిటి? సీఎంను అడ్డుకున్న పొరుగింటి వ్యక్తి

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (20:36 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పొరుగింటి వ్యక్తి నుంచి నిరసన సెగ తగిలింది. సీఎం కోసం వస్తున్న అతిథుల కారణంగా పార్కింగ్ సమస్య వస్తుందని పక్కింటి వ్యక్తి నరోత్తమ్ తనలోని ఆవేదన, అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఖంగుతిన్న సీఎం సిద్ధరామయ్య.. పార్కింగ్ సమస్యను తక్షణం పరిష్కరించాలని తన సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. 
 
శుక్రవారం ఉదయం నరోత్తమ్ అనే పెద్దాయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నేరుగా సీఎం కారు వద్దకు వెళ్లిన ఆయన మీ కోసం వచ్చే వారు ఎక్కడపడితే అక్కడ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల తన ఇంటి గేటు కూడ బ్లాక్ అవుతుంది. గత ఐదేళ్ల నుంచి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇక భరించడం తమ వల్ల కాదని అన్నారు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. 
 
మరోవైపు, కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన తన అధికార నివాసంలోకి మారలేదు. సీఎం బంగ్లాలో ఇటీవలి వరకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉండేవారు. గతంలో తనకు కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే సిద్ధరామయ్య ఉంటున్నారు. వచ్చే నెలలో ఆయన సీఎం అధికారిక భవనానికి మారే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments