Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై పోలీసులు వేధిస్తున్నారు.. కోర్టుకెక్కిన ఐపీఎస్ అధికారిణి

Webdunia
మంగళవారం, 4 మే 2021 (08:36 IST)
తనను ముంబై పోలీసు అధికారులు వేదిస్తున్నారంటూ ఓ ఐపీఎస్ అధికారిణి వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ప్రస్తుతం హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్ అదనపు డీజీగా ఉన్నారు. ఈమె మహారాష్ట్ర ఐపీఎస్ అధికారిణి.
 
ఈమె మహారాష్ట్ర నిఘా విభాగాధిపతిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ముంబైలో ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. దీనిపైనే ఆమె కోర్టుకెక్కారు. 
 
ప్రస్తుత కరోనా సమయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ముంబై పోలీసులు వేధిస్తున్నారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పందించిన న్యాయస్థానం ఆమె పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ముంబై పోలీసులకు నోటీసులు జారీచేసింది. రష్మీ శుక్లా పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments