Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళ.. పట్టుకొనివచ్చి నగ్నంగా చేసి సెల్ఫీలు తీసుకున్నారు!

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఓ గ్రామంలో పట్టపగలో దుశ్శాసన పర్వం జరిగింది. ఓ మహిళ తన భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది.

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (10:29 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఓ గ్రామంలో పట్టపగలో దుశ్శాసన పర్వం జరిగింది. ఓ మహిళ తన భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది. ఆ తర్వాత ఆ మహిళను, ఆమె ప్రియుడిని పట్టుకుని వచ్చి నగ్నంగా చేసి, చెట్టుకు కట్టేసి కొందరు అల్లరి యువకులు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ దారుణ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉదయ్‌పూర్ జిల్లా కసోటియా గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళ... తన భర్తను విదిలి తాను ప్రేమించిన యువకుడితో పారిపోయింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆమె భర్త, కుటుంబ సభ‍్యులు, గామస్తులు కలసి.. ఆ మహిళ, ప్రియుడిని పట్టుకునివచ్చి నగ్నంగా చేసి గ్రామంలో ఊరేగించారు. ఆ తర్వాత ఇద్దరినీ అలాగే రెండు రోజుల పాటు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ సమయంలో కొందరు యువకులు సెల్ఫీలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దారుణం సోమవారం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఇంత జరుగుతున్నా ఈ దారుణంపై ఏ ఒక్కరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా, ప్రభుత్వ కార్యాలయం, స్కూలుకు సమీపంలోనే ఈ సంఘటన జరిగినా.. ఉపాధ్యాయులు లేదా ప్రభుత్వ అధికారులు కూడా నోరెత్తలేదు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చాక శుక్రవారం బాధిత మహిళను రక్షించారు. ఈ దారుణానికి 30 మంది పాల్పడినట్టు తెలుస్తుండగా, మహిళా భర్త, ముగ్గురు మహిళలతో సహా 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ గ్రామ పట్వారీని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరణ ఇవ్వాల్సిందిగా టీచర్లను, వైద్య సిబ్బందిని ఆదేశించారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం