వారం రోజుల క్రితం జాడ తెలియకుండా పోయిన సోనియా గాంధీ కమెండో రాకేశ్ కుమార్ ఢిల్లీ పోలీసులు కనుగొని, అతడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే అతడు బిచ్చం ఎత్తుకుంటూ వీధుల్లో తిరుగుతూ కనిపించడమే. ఇంతకీ అసలు అతడెందుకు అలా మారాల్సి వచ్చిందో తెలుసుకుంట
వారం రోజుల క్రితం జాడ తెలియకుండా పోయిన సోనియా గాంధీ కమెండో రాకేశ్ కుమార్ ఢిల్లీ పోలీసులు కనుగొని, అతడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే అతడు బిచ్చం ఎత్తుకుంటూ వీధుల్లో తిరుగుతూ కనిపించడమే. ఇంతకీ అసలు అతడెందుకు అలా మారాల్సి వచ్చిందో తెలుసుకుంటే ఈ విషయం బయటపడింది.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజి) కమెండో రాకేశ్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం టెన్ జన్ పథ్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి బ్యాంకులో 4 లక్షల రూపాయల అప్పు ఉంది. ఆగస్టు 31 నాటికి తన వద్ద వున్న మొత్తం రూ.40 వేలు బ్యాంకు ఇన్‌స్టాల్‌మెంట్‌కు కట్టేయడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇక ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్లాలనుకుని ఇంటికి వెళ్లకుండా సంపన్నులు నివాసం వుండే లూటియన్స్ ప్రాంతంలోని పార్కులలో తిరుగుతూ కాలం వెళ్లబుచ్చాడు.
ఈ క్రమంలో అతడికి తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక బిచ్చగాడిలా మారిపోయి భిక్షమెత్తుకోవడం ప్రారంభించాడు. ఈ స్థితిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతడే సోనియా గాంధీ సెక్యూరిటీ కమెండోగా తేలింది. నిజాయితీతో పనిచేసే రాకేశ్ ఇలా బిచ్చగాడిగా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది.