Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ లేకుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ పరుగో పరుగు... సొరంగంలో ప్రయాణికులతో....

పైలెట్ లేకుండా విమానం నడిస్తుంది అంటే నమ్ముతాం. రోబొటిక్ టెక్నాలజీతో నడిచే వాహనం గురించి తెలుసు. కానీ డ్రైవర్ లేకుండా ఓ రైలు పరుగులు తీస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకేముంది పైప్రాణాలు పైనే పోవు. కా

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (16:41 IST)
పైలెట్ లేకుండా విమానం నడుస్తుంది అంటే నమ్ముతాం. రోబొటిక్ టెక్నాలజీతో నడిచే వాహనం గురించి తెలుసు. కానీ డ్రైవర్ లేకుండా ఓ రైలు పరుగులు తీస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంకేముంది పైప్రాణాలు పైనే పోవు. కానీ ఇది జరిగింది. రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవరు లేకుండా 15 కిలోమీటర్ల మేర పరుగులు తీసింది. 
 
ఈ ఘటన సోమవారంనాడు మజ్‌గావ్-నిజామూద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు జరిగింది. రత్నగిరి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్నప్పుడు రైలు ఇంజినులో లోపం ఏర్పడింది. దీనితో సాయంత్రం 5.50 నిమిషాలకు బండిని ఆపేసి టెక్నికల్ సమస్య గురించి చెక్ చేస్తున్నారు. టెక్నీషియన్లు లోపాన్ని సరిదిద్దే క్రమంలో లోకో పైలట్ గార్డు క్యాబిన్లోకి వెళ్లాడు. ఐతే లోపం సరిచేయకమునుపే రైలు కదలడం ప్రారంభించింది. 
 
సొరంగం అంతా పల్లంగా ఉండటంతో వేగంగా అలా 15 కిలోమీటర్ల మేరు దూసుకువెళ్లింది. దీంతో లోకో పైలెట్ విషయాన్ని గమనించి గార్డు క్యాబిన్ నుంచి ఇంజిన్లోకి దూరి రైలును తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఐతే ఈ వార్తలను కొంకణ్ రైల్వే చైర్మన్ తోసిపుచ్చారు. అలాంటిదేమీ జరగలేదని బుకాయించారు. మరి ఈ విషయం ఎలా బయటకు వచ్చిందోమరి.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments