Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచారం, హత్య... టీ-వడై ఇవ్వరూ... సుప్రీం తీర్పుతో రేపిస్ట్ ఖుషీ....

ఓ కామాంధుడి కామానికి బలైపోయిన అభాగ్యురాలి కథ ఇది. కదులుతున్న రైల్లో ఆమెపై అత్యాచారం చేయడమే కాక, ఆ దారుణానికి పాల్పడి ఆమెను రైల్లో నుంచి తోసేసిన ఘోరమైన గాధ ఇది. వివరాల్లోకి వెళితే... ఐదేళ్ల క్రితం 24 ఏ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (16:40 IST)
ఓ కామాంధుడి కామానికి బలైపోయిన అభాగ్యురాలి కథ ఇది. కదులుతున్న రైల్లో ఆమెపై అత్యాచారం చేయడమే కాక, ఆ దారుణానికి పాల్పడి ఆమెను రైల్లో నుంచి తోసేసిన ఘోరమైన గాధ ఇది. వివరాల్లోకి వెళితే... ఐదేళ్ల క్రితం 24 ఏళ్ల సౌమ్య(కేరళ) ఓ షాపింగ్ మాల్‌లో పని ముగించుకుని 2011 ఫిబ్రవరి 1న మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టింది. ఏర్నాకులం నుంచి శొర్‌నూర్ వరకూ రైల్లో వెళుతోంది. ఈ సమయంలో తమిళ యువకుడు గోవిందచామి రైలెక్కాడు. మహిళా బోగీలో సౌమ్య ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. 
 
దొంగతనాలు చేసే అతడు ఆమె వద్ద సొమ్మును దోచుకోవడమే కాకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను రైల్లో నుంచి కిందికి తోసేశాడు. అడవుల్లో ఆమెను కనుగొన్న స్థానికులు ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ఆమె మృతి చెందింది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుపై విచారణ చేసిన కోర్టులు గోవిందచామికి మరణ శిక్ష విధించాయి. ఎన్ని కోర్టు మెట్లెక్కినా అదే ఫలితం వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు తలుపుతట్టాడు గోవిందచామి. 
 
వాదనలు విన్న సుప్రీంకోర్టు సౌమ్యపై అత్యాచారం చేసింది గోవిందచామి అయినప్పటికీ ఆ తర్వాత ఆమెను రైల్లోంచి తోసింది అతడా కాదా అని బాధితురాలి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించకపోవడంతో రైల్లోంచి తోసింది గోవిందచామేనని నిరూపితం కాలేదు కనుక అతడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఈ తీర్పుతో బాధితురాలి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆమె ప్రాణాలు తీసిన వ్యక్తికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష విధించి వదిలేస్తారా అని ఆమె ప్రశ్నిస్తోంది. కాగా దోషి గోవిందచామి మాత్రం తనకు టీ, వడై ఇవ్వరూ అంటూ పండగ చేస్కుంటున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments