Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత డెత్ మిస్టరీ: ఈ-మెయిల్ లభ్యం.. డయాబెటిస్ మందులు మార్చేసిన మాట నిజమే!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల మిస్టరీ వీడట్లేదు. ఆమె మరణంపై పలు అనుమానాలున్నాయి. అపోలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో ఇతరులను ఆమెను పరామర్శించకుండా అడ్డుకునేందుకు కారణాలు లేవని, అపోలో అమ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (13:33 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల మిస్టరీ వీడట్లేదు. ఆమె మరణంపై పలు అనుమానాలున్నాయి. అపోలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో ఇతరులను ఆమెను పరామర్శించకుండా అడ్డుకునేందుకు కారణాలు లేవని, అపోలో అమ్మ ఫోటోలను కూడా విడుదల చేయకపోవడానికి అసలు కారణం ఏమిటనే దానిపై చర్చ సాగుతున్న తరుణంలో ఓ ఈ-మెయిల్ ఆధారం.. అమ్మది సహజ మరణం కాదని చెప్తోంది. 
 
అమ్మను పక్కా ప్లాన్ ప్రకారమే చంపేశారని ఎన్డీటీవీ రిపోర్టర్ బర్కాదత్‌-అపోలో ఆస్పత్రి అధికారికి మధ్య జరిగిన ఈ-మెయిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎన్డీటీవీ రిపోర్టర్‌కు అందిన మెయిల్‌లో జయలలిత అపోలోలో చేరకముందే ఆమెకు డయాబెటిస్ మందులను మార్చి.. తప్పుడు మందులను ఇచ్చారని అపోలో అధికారి పేర్కొన్నట్లు కలదు. అపోలోలో చేరకముందే డయాబెటిస్‌కు ఇవ్వాల్సిన మందులకు బదులు వేరే మందుల్ని అమ్మకు ఇచ్చినట్లు ఈ మెయిల్ బట్టి తెలుస్తోంది. 
 
ఇకపోతే.. అపోలో 75 రోజుల పాటు అమ్మకు చికిత్స అందించిందా? ఇతరత్రా వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచిందనే విషయంపై చర్చ మొదలైంది. అమ్మ ఆస్పత్రిలో ఉన్నంత కాలం శశికళ కుటుంబీకులే ఆమె వెంట ఉండేందుకు కారణం ఏంటనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను ఆరోగ్యంగా ఉన్నానని మరుజన్మ ఎత్తానని జయలలిత ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో.. ఫోటోలు ఎందుకు విడుదల కాలేదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
పైన గల ఈమెయిల్ ద్వారా అమ్మ కాస్త కోలుకున్నా.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పలేదు. మెదడు మాత్రం పనిచేస్తుందని అర్థమవుతోంది. అయితే గుండెపోటు వచ్చిన తర్వాత లివర్ పాడైందని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలపడంపై కూడా అనుమానాలున్నాయి. అమ్మ కోలుకున్నారని, ఆహారం తీసుకుంటున్నారని, ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు ఎందుకు ప్రకటన చేశారని అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

జాబిలమ్మ నీకు అంతా కోపమా సినిమాని సపోర్ట్ చేయండి : జాన్వీ నారంగ్

కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కించిన మారియో నుంచి వాలెంటైన్స్ డే పోస్టర్

Nandamuri Balakrishna: థమన్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments