Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి బ్రోకర్‌లా మారారు... శివసేన : అలా చేయడం తప్పా.. ఫడ్నవిస్

'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించే దిశగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. దర్శకనిర్మాతలకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. దీంత

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (15:16 IST)
'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించే దిశగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. దర్శకనిర్మాతలకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. దీంతో సమస్య కొంతమేరకు సద్దుమణిగింది. దీనిపై శివసేన మండిపడుతోంది. 'ముఖ్యమంత్రి బ్రోకర్లా మారారు.. పాకిస్థానీలకు వత్తాసు పలుకుతున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 
 
ఈ వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. తన అధికారిక నివాసం 'వర్ష'లో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ... ఈ సమస్య పరిష్కారానికి ఆ సమయంలో నా ముందు రెండు దారులున్నాయి. ఒకటి.. ఆ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను భారీగా మోహరించడం. రెండోది ఇరు పక్షాలతో చర్చలు జరపడం. ఇందులో తాను చర్చలకు మొగ్గుచూపా. ఇరుపక్షాలను పిలిపించా. 
 
అక్కడ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే మూడు డిమాండ్లు మా ముందుంచారు. అందులో రెండింటికి (ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడం, భవిష్యత్‌లో పాక్ నటులను తీసుకోకపోవడం) ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇక మూడోదైన 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' డిమాండ్‌ను మాత్రం నేను అక్కడికక్కడే ఖండించా. సైనిక సహాయనిధికి విరాళాలు డిమాండ్ చేయడం సరికాదని రాజ్‌ఠాక్రేను వారించా' అని ఫడ్నవిస్ చెప్పారు.
 
చర్చల ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టిన తనను అభినందించాల్సిదిపోయి విమర్శలు గుప్పించడం అజ్ఞానమన్న సీఎం ఫడ్నవిస్.. కాశ్మీర్ వేర్పాటువాదులతోనూ, తీవ్రవాదులతోనూ ప్రభుత్వాలు చర్చలు జరపడంలేదా?అని ప్రశ్నించారు. అమరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవడంలో తప్పులేదని, అయితే అలా చేయాలని డిమాండ్ చేయడం మాత్రం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు.  

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments