Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో విమానాలు ఎలా ఎగురుతాయో... దిగుతాయో మేం చూస్తాం : శివసేన ఎంపీల దాదాగిరి

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరి ప్రదర్శించారు. నిండు సభలోనే కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి అశోకగజపతి రాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ప

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:56 IST)
లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరి ప్రదర్శించారు. నిండు సభలోనే కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి అశోకగజపతి రాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా విధించిన నిషేధాన్ని ఎత్తివేయకుంటే ముంబై ఎయిర్‌పోర్టులో విమానాలు ఎలా ఎగురుతాయో.. దిగుతాయో తాము చూస్తామని హెచ్చరించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రవీంద్ర గైక్వాడ్ అంశం గురువారం చర్చకు వచ్చింది. ఆ సమయంలో శివసేన ఎంపీలతో కలిసి ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనంత్ గీతె కేంద్ర పౌరవిమానాయాన శాఖామంత్రి అశోకగజపతి రాజుపై దాడికి యత్నించారు. ఈ దాడిని పలువురు కేంద్ర మంత్రులు అడ్డుకున్నారు. 
 
అంతటితో ఆగని శివసేన ఎంపీలు... స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముంబై విమానాశ్రయంలో విమానాలు ఎలా దిగుతాయో.. ఎగురుతాయో తామూ చూస్తామని స్పీకర్ సమక్షంలోనే హెచ్చరించడం గమనార్హం. అంటే లోక్‌సభ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరికి పాల్పడ్డారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments