Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అత్యధిక విరాళాలు ఇచ్చిన శివ్ నాడార్..

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (10:16 IST)
ప్రముఖ వ్యాపారవేత్త, హెచ్.‌సి.ఎల్‌ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. యేడాది కాలంలో ఆయన దాతృత్వ కార్యక్రమాలకు రూ.2,153 కోట్లు ఖర్చు చేసి మరోసారి దేశంలో మొదటి స్థానంలో నిలిచారు. 
 
వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సంస్థలు తమ తమ ఆదాయంలో కొంతమేరకు సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా ఎడెల్గావ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. గత ఏడేళ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలు ఇచ్చిన దాతల్లో శివ్ నాడార్ ప్రథమ స్థానంలో నిలిచారు.
 
ఇక మహిళల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకరి సతీమణి రోహిణి నిలేకరి మొదటి స్థానంలో నిలిచారు. ఆమె ఫిలాంత్రఫీస్ అనే ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న సంస్థలకు, పర్యావరణ సుస్థిరత కోసం విరాళాలు అందజేస్తున్నారు. 
 
గత ఆర్థిక సంవత్సరంలో రోహిణి నిలేకరి రూ.154 కోట్లు విరాళాలుగా అందించింది. దాతల్లో పిన్న వయస్కుడు జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ (38) మొదటి స్థానంలో ఉన్నారు. మానసిక ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత, విద్యారంగం కోసం నిఖిల్ కామత్ విరాళాలు ఇచ్చారు.
 
ఎడెల్గావ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ 2024లో గత ఆర్థిక సంవత్సరంలో 203 మంది దాతలు 8,783 కోట్ల విరాళాలు ఇచ్చారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే విరాళాలు 55 శాతం పెరిగాయి. 18 మంది దాతలు రూ.100 కోట్లకుపైగా విరాళాలు అందించారు. 30 మంది దాతలు రూ.50 కోట్ల పైచిలుకు, 61 మంది దాతలు రూ.20 కోట్ల పైచిలుకు విరాళాలు అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments