Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి వచ్చి దొంగలపాలయ్యాడు.. షెల్టర్‌లో బస సంతోషం అంటున్నాడు

జూన్ 6న రైలులో ప్రయాణిస్తుండగా జాన్ పాస్‌పోర్టు, వీసా తదితరాలున్న బ్యాగ్ ఎవరో దొంగిలించడంతో ఆరోజు రాత్రి బేగంపేటలోని జీహెచ్‌ఎంసీ నైట్‌షెల్టర్‌ను ఆశ్రయించారు. దేశం కాని దేశంలో అనాథగా మిగిలిన జాన్ కష్టకాలాల్లో విడిగా హోటళ్లలో ఉండటం కంటే ఇలాంటి నైట్ షెల

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (03:17 IST)
విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, అనూహ్యంగా చెంత ఉన్న సమస్తాన్నీ పోగొట్టుకున్నప్పుడు సగటు మనుషులతో కాలం గడిపితే అంతకు మించిన సంతోషం, పరమార్థం మరొకటి లేదంటున్నారీ అభాగ్య అమెరికన్. భారతీయ భాషలు నేర్చుకునేందుకు, ఇక్కడి సాహిత్యం, స్నేహసంబంధాలు తదితరమైనవి అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చిన అమెరికా వాసి ప్రీజెన్ జాన్ మార్విన్ అనుకోకుండా పాస్ పోర్టు, వీసా మొదలైనవి ఉన్న బ్యాగ్ ‌దొంగల పరం కావడంతో వట్టి చేతులతో మిగిలారు. 
 
కట్టుబట్టలు తప్ప మరేమీ లేని జాన్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్మించిన నైట్ షెల్టర్‌లో ఆశ్రయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం జాన్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక అమెరికా కాన్సులేట్‌ అధికారులతో మాట్లాడి ఎమర్జెన్సీ పాస్‌పోర్టు వచ్చేలా కృషి చేశారు. స్థానిక అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు మంగళవారం జాన్‌కు పాస్‌పోర్టు అందజేసినట్లు నైట్‌షెల్టర్‌ నిర్వహిస్తున్న ఎస్‌ఈఎస్‌(శ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీ) ప్రతినిధి జయశ్రీ తెలిపారు. 
 
వీసా కూడా వస్తే నేపాల్‌ వెళ్తానని జాన్‌ తెలిపారు. నగరంలో ఏ హోటల్‌లో ఉండాలనుకుంటే అక్కడ ఉండవచ్చునని బుర్రా వెంకటేశం తెలిపినప్పటికీ జాన్‌ నైట్‌షెల్టర్‌లోనే ఉంటున్నారు. షెల్టర్లో ఉండటమే తనకు సంతోషంగా ఉందని, తగిన రక్షణగా ఉందని చెప్పారు. ‘హోటళ్లు వద్దు.. నైట్‌షెల్టరే బాగుంది. ఇక్కడే విభిన్న వర్గాలకు చెందిన, వివిధ రకాల మనుషుల్ని కలుసుకునే అవకాశం కలుగుతోంది’ అని వారం రోజులుగా జీహెచ్‌ఎంసీ నైట్‌షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న జాన్ మీడియాకు చెప్పారు.
 
జూన్ 6న రైలులో ప్రయాణిస్తుండగా జాన్ పాస్‌పోర్టు, వీసా తదితరాలున్న బ్యాగ్ ఎవరో దొంగిలించడంతో ఆరోజు రాత్రి బేగంపేటలోని జీహెచ్‌ఎంసీ నైట్‌షెల్టర్‌ను ఆశ్రయించారు. దేశం కాని దేశంలో అనాథగా మిగిలిన జాన్ కష్టకాలాల్లో విడిగా హోటళ్లలో ఉండటం కంటే ఇలాంటి నైట్ షెల్టర్‌లలో బస చేయడం రక్షణ పరంగానే కాదు మానవీయ పరంగా కూడా మంచి అనుభూతులను కలిగిస్తోందని చెప్పారు. 
 
ఆకలి తీర్చుకోవడం కోసమో, వృత్తి కోసమో దొంగతనాన్ని అలవర్చుకున్నవారు కనీసం విదేశీ అతిథుల వస్తువులనైనా తాకకుండా ఉంటే వారికి ఎంతో మేలు చేసినవారవుతారు కదా..
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments