Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ పనితీరు అద్భుతం : శశిథరూర్ పొగడ్తలు

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2014 (11:55 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోమారు పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడీ అద్భుతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ఇప్పటి వరకు తాను చూసిన ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీనే అత్యుత్తమ ప్రధానంటూ పొగిడేశారు.
 
ఇపుడు తాజాగా మోడీ పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని సాగరతీరాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను శశిథరూర్ ట్వీట్ చేశారు. వాటిని చూసిన ప్రధాని మోడీ పారిశుద్ధ్య కార్యక్రమంలో థరూర్ పాల్గోవడం ప్రోత్సాహకరమని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు థరూర్ ట్వీట్ చేసిన ఫోటోలను జత చేసి రీట్వీట్ చేశారు. 
 
అయితే, ఇప్పటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవిని పోగొట్టుకున్న థరూర్.. ఇపుడు మరింతగా దూకుడుగా పొగడ్తల వర్షం కురిపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. థరూర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments