Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ సూపర్.. పనితీరు అద్భుతం : శశిథరూర్ ప్రశంసలు

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2014 (10:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం ఏమాత్రం ఆగడం లేదు. నరేంద్ర మోడీ అద్భుతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ఇప్పటి వరకు తాను చూసిన ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీనే అత్యుత్తమ పీఎం అని అన్నారు. 
 
ఇపుడు తాజాగా మోడీ పిలుపు మేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని సాగరతీరాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను శశిథరూర్ ట్వీట్ చేశారు. వాటిని చూసిన ప్రధాని మోడీ పారిశుద్ధ్య కార్యక్రమంలో థరూర్ పాల్గోవడం ప్రోత్సాహకరమని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు థరూర్ ట్వీట్ చేసిన ఫోటోలను జత చేసి రీట్వీట్ చేశారు. 
 
అయితే, ఇప్పటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవిని పోగొట్టుకున్న థరూర్.. ఇపుడు మరింతగా దూకుడుగా పొగడ్తల వర్షం కురిపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. థరూర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments