Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామపిశాచులు.. పండుటాకుల్ని కూడా వదలట్లేదా? కేరళ అసెంబ్లీలో రేగిన దుమారం..

రేపోమాపో రాలిపోనున్న పండుటాకులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. బాలికలు, యువతులు, మహిళలు, ముదుసలి వంటి ఏ వయస్సులో ఉన్నా మహిళలను కామాంధులు వదిలిపెట్టట్లేదు. తాజాగా పండు ముదుసలులపై లైంగిక దాడులు పె

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:28 IST)
రేపోమాపో రాలిపోనున్న పండుటాకులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. బాలికలు, యువతులు, మహిళలు, ముదుసలి వంటి ఏ వయస్సులో ఉన్నా మహిళలను కామాంధులు వదిలిపెట్టట్లేదు. తాజాగా పండు ముదుసలులపై లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయని కేరళ అసెంబ్లీలో దుమారం రేగింది. మీడియాలో వచ్చిన నివేదిక ఆధారంగా కేరళ అసెంబ్లీలో ఈ వ్యవహారంపై దుమారం రేగింది. 
 
కేరళలోని వివిధ జిల్లాల్లో 70 సంవత్సరాలు పైబడిన మహిళలు, వాళ్ల బంధువులు, అగంతకుల చేతిలో అత్యాచారాలకు గురవుతున్నారని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఓ 85 ఏళ్ల పండు ముదుసలి తన అల్లుడి చేతిలో లైంగిక దాడికి గురైంది. కుటుంబ సభ్యులకు ఈ దారుణం సంగతి చెప్పింది. అయితే సొసైటీలో పెద్ద మనిషి ముసుగేసుకున్న ఆ నీచుడు తప్పించుకోవడంతో ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయింది. ఇలా వావివరుసలు లేకుండా ముదుసలులపై అత్యాచారాలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. మతిస్థిమితం కోల్పోయి వీధుల్లో బిచ్చమెత్తుకునే మహిళలపై కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నట్టు నివేదిక తెలిపింది. ఇలా రకరకాలుగా లైంగిక దాడులకు గురైన ఏడుగురు మహిళలను రక్షించినట్టు నివేదికలో పేర్కొన్నారు. 
 
ఇంకా ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులకు తప్పతాగే అలవాటు, మనో వైకల్యం వంటివి ఏవీ లేవని వారంతా మామూలు స్థితిలోనే ఉన్నారని తాజా నివేదిక తేల్చింది. ఈ ఘటనలపై స్పందించిన కేరళ సర్కార్.. వీటిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని సీఎం పినరాయ్ విజయన్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు కేరళలోనే మాత్రమే గాకుండా దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని.. ఆయా రాష్ట్రాలు మహిళల రక్షణార్థం కఠినమైన చట్టాలు తేవాలని.. ఇందుకోసం చట్ట సవరణ చేయాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం