Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వేధింపులకు గురైన ఉద్యోగినులకు వేతనంతో కూడిన సెలవు!

Webdunia
శనివారం, 18 జులై 2015 (13:03 IST)
లైంగిక వేధింపులకు గురయ్యే మహిళా ఉద్యోగినులకు వేతనంతో కూడిన మూడు నెలల సెలవు తీసుకోవడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా బాధితురాలికి చట్టప్రకారం లభించే సెలవుల నుంచి వీటిని కోతపెట్టకూడదని తేల్చిచెప్పింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలను విచారణ సమయంలో అవసరమైతే వేరే విభాగానికి బదిలీ చేయొచ్చని కూడా తెలిపింది. అయితే, లైంగిక వేధింపులకు గురైన మహిళలు ప్రభుత్వకార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫిర్యాదుల స్వీకరణ విభాగాలకు ఘటన జరిగిన మూడు నెలలలోపు ఫిర్యాదుచేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.
 
అదేవిధంగా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లి అయిన ప్రభుత్వ ఉద్యోగిని ప్రసూతి సెలవు పొందేందుకు అర్హురాలేనని ఢిల్లీ హైకోర్టు తీర్పుచెప్పింది. ఢిల్లీ హైకోర్టులోని న్యాయమూర్తి జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌ తీర్పు ఇస్తూ సెలవు ఇవ్వకపోతే మాతాశిశువులకు హాని కలుగుతుందన్నారు. గర్భందాల్చిన ఉద్యోగినికి మాత్రమే ప్రసూతి సెలవును మంజూరుచేయడం... అద్దె గర్భం ద్వారా తల్లి అయిన వారికి సెలవును తిరస్కరించడమంటే.... శాస్త్రపురోగతిని గుర్తించకుండా కళ్లు మూసుకోవడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి