Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500, రూ.1000 నోట్ల రద్దు.. వయోవృద్ధులు, దేవాంగులకు ప్రత్యేక క్యూ..

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కరెన్సీ మార్పిడి కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయోవృద్ధులు, దేవాంగులు క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సోమవారం కేంద్ర ప్రభుత్వ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (15:28 IST)
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కరెన్సీ మార్పిడి కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయోవృద్ధులు, దేవాంగులు క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సోమవారం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 
 
ప్రభుత్వ తాజా నిర్ణయంతో వయోవృద్ధులు, దేవాంగులు ప్రత్యేక క్యూ ద్వారా బ్యాంకులో నగదు మార్పిడి చేసుకోవచ్చు. దీంతో పాటు పెన్షనర్లు ఏటా ప్రభుత్వానికి ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ గడువును వచ్చే ఏడాది జనవరి 15కు పెంచినట్లు ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు.
 
ఆదివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాలుగైదు రోజులుగా బ్యాంకు ఉద్యోగులు నిరంతరాయంగా పనిచేస్తున్న తరుణంలో బ్యాంకర్లకు వారు అభినందనలు తెలిపారు. ఇంకా ఏటీఎంలలో నగదు లావాదేవీలను రోజుకు రూ.2,500లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 
త నోట్ల రద్దు ప్రకటన వెలువడగానే కొత్త నోట్లకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఏర్పడింది. కొత్త 2వేల నోటు చేతిలోకి రాగానే అంతా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొత్త నోట్ల నాణ్యత గురించి పెద్ద చర్చే జరుగుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments