Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేఖర్ రెడ్డికి కొత్త నోట్లిచ్చింది తిరుపతి బ్యాంకు అధికారులే... ఎంత ధైర్యం?

కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించి ఐటీ అధికారులకు అడ్డంగా బుక్కయిన తితిదే మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. ఇప్పటివరకు శేఖర్ రెడ్డి వద్ద 131 కోట్ల రూపాయల డబ్బులతో పాటు 160 కిలోలకుపైగా బంగారాన్ని ఐటీ అధికారులు స్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (13:52 IST)
కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించి ఐటీ అధికారులకు అడ్డంగా బుక్కయిన తితిదే మాజీ పాలకమండలి సభ్యులు శేఖర్ రెడ్డి బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. ఇప్పటివరకు శేఖర్ రెడ్డి వద్ద 131 కోట్ల రూపాయల డబ్బులతో పాటు 160 కిలోలకుపైగా బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే త్రవ్వే కొద్దీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి.
 
శేఖర్ రెడ్డి నుంచి ఐటీ స్వాధీనం చేసుకున్న నగదులో 50 కోట్ల రూపాయలు కొత్త నోట్లే ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించి ఆశ్చర్యపోయారు. బ్యాంకులలో ఉండాల్సిన ఇంత మొత్తం, అందులోను కొత్త నోట్లు నేరుగా శేఖర్‌ రెడ్డి ఇంటికి చేరుకోవడం ఏమిటని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసును సిబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుండగా లోతుగా విచారణ కొనసాగుతోంది.
 
శేఖర్ రెడ్డి ఇప్పటికే తితిదే పాలకమండలి సభ్యులుగా ఉండి చివరకు అక్రమ ఆస్తుల వ్యవహారంలో పదవి పోగొట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ముందు నుంచీ తిరుపతిలో పరిచయాలు ఏర్పరచుకున్న శేఖర్ రెడ్డి చివరకు తన వద్దనున్న కొత్త నోట్లన్నీ తిరుపతి బ్యాంకుల నుంచీ తీసుకెళ్ళినట్లు సిబీఐ, ఈడీ విచారణలో తేలింది. కొత్త నోట్లలో కొన్ని నేరుగా ఆర్‌బిఐ నుంచి శేఖర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళగా మరికొన్ని తిరుపతిలోని ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంకు, తమిళనాడు మర్కెంటైల్‌ బ్యాంకుల నుంచి వెళ్ళినట్లు గుర్తించారు. దీనిపై ఇప్పటికే బ్యాంకు మేనేజర్లను విచారించిన ఈడీ, సిబీఐ మరింత లోతుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
తిరుపతిలోని ప్రధాన బ్రాంచ్‌లకు సంబంధించిన మూడు బ్యాంకుల మేనేజర్లను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే తమ విచారణలో తమకేం సంబంధం లేదని సీబీఐకు బ్యాంకు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్లు ఎంత వాదించినా డబ్బులు మాత్రం వారి నుంచే కమిషన్ల రూపంలో వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం మీద శేఖర్ రెడ్డి వ్యవహారం ముగ్గురు మేనేజర్ల మెడకు చుట్టుకోనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments