జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఒకే జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని.. అందుకే మాజీ భర్త పవన్ వెళ్లిన చోటుకే.. రేణూ దేశాయ్ పర్యటించారని వస్తున్న వార్తలపై రేణూ స్పందించింది.
కర్నూలు జిల్లాలో పర్యటించాలని ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నానని.. అదే సమయంలో కళ్యాణ్ గారు కూడా కర్నూల్ వచ్చారని.. ఆయనొచ్చారని రైతుల సమస్యలపై ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాన్ని వాయిదా వేసుకోలేనని రేణు తెలిపింది.
పవన్ గారి స్థానంలో వేరొక రాజకీయ వేత్త వుండినా తన షో యధావిథిగా సాగేది కదా అంటూ రేణూ దేశాయ్ వెల్లడించింది. ఈ విషయాన్ని పక్కనబెట్టి కళ్యాణ్ గారి రాజకీయ పర్యటనకు దెబ్బతీసేందుకే తాను కర్నూలు జిల్లాలో రైతు సమస్యలపై స్పందించానని.. సినిమా తీసేందుకు ముందు వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకుని షో చేసేందుకు కర్నూలుకు వచ్చానని చెప్పింది.
అదే సమయంలో కళ్యాణ్ గారు కర్నూలు టూరులో వున్నారని.. ఇందంతా అనూహ్యంగా జరిగిందని.. అంతేకానీ కర్నూలు టూర్‌లో ఎలాంటి రాజకీయాల్లేవని రేణూ దేశాయ్ స్పష్టం చేసింది. బుద్ధి లేని మూర్ఖులకే ఎంత చెప్పినా బుర్రకెక్కలేదని.. ఇకనైనా ట్రోల్ చేయడం ఆపండంటూ రేణూ కంటతడి పెట్టింది.