హత్య కేసుల్లో గుర్మీత్ విచారణ.. పోలీసుల అధీనంలో కోర్టు ప్రాంగణం

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీర్ రాం రహీం సింగ్‌పై నమోదైన రెండు హత్య కేసుల విచారణ శనివారం జరుగనుంది. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (06:46 IST)
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీర్ రాం రహీం సింగ్‌పై నమోదైన రెండు హత్య కేసుల విచారణ శనివారం జరుగనుంది. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
గుర్మీత్ అనుచరులు విధ్వంసకాండకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు సమాచారం అందించడంతో సిర్సా, పంచకుల, రోహ్‌తక్ తదితర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. గుర్మీత్ ఉన్న జైలు పరిసరాల్లో కనీవినీ ఎరుగని భద్రతను కల్పించారు. పంచకుల కోర్టు ఆవరణను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 
 
కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు రుజువు కావడంతో గుర్మీత్‌కు 20 సంవత్సరాల శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆపై డేరాలో అధికారులు సోదాలు జరుపగా, పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గుర్మీత్ విలాస వంతమైన జీవితం, అమ్మాయిల గదుల్లోకి రహస్య మార్గాలు, అస్తి పంజరాలు, కట్టల కొద్దీ రద్దయిన నోట్లు, బంగారం, విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments