Webdunia - Bharat's app for daily news and videos

Install App

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సెల్వి
శుక్రవారం, 30 మే 2025 (11:13 IST)
తల్లిదండ్రుల తర్వాత గురువులు చిన్నారుల అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ టీచర్ విద్యార్థినులను చెప్పుతో కొట్టిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కళ్లకురిచ్చి, చిన్న సేలంలోని బాలికల పాఠశాలలో శాంతి టీచర్‌గా పనిచేస్తోంది. గత 2017వ సంవత్సరం ఇద్దరు విద్యార్థినులను చెప్పుతో కొట్టింది. విద్యార్థినులు ఉపయోగించే బాత్రూమ్‌ను తెరిచివుంచే ఉపయోగించడం చూసిన విద్యార్థులు డోర్‌ను క్లోజ్ చేశారు. బయట వేచి వున్నారు. దీంతో ఆవేశానికి గురైన టీచర్.. ఆ విద్యార్థినులను చెప్పుతో కొట్టింది. 
 
ఇంకా ఆ విద్యార్థినులను తరగతి గదిలో కాకుండా బయట కూర్చోబెట్టింది. ఇంకా మార్క్ షీట్ల కోసం డబ్బు వసూలు చేసింది. ఈ విషయం బయట చెప్తే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులతో తెలపడంతో.. వారు హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. 
 
అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులకు ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 
 
ఈ క్రమంలో జరిపిన విచారణలో టీచర్ ఇలా విద్యార్థినులను చెప్పుతో కొట్టడం అమానుష చర్యగా ఖండించి.. విద్యార్థినులకు చెరో రూ.2లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా శాంతిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments