Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరసాలలో చిన్నమ్మ.. ఆదివారం నుంచి పని... రోజుకు రూ.50 కూలి

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన జయలలిత స్నేహితురాలు శశికళ ఇపుడు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. జయ అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్షను సుప్రీంకో

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:31 IST)
తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన జయలలిత స్నేహితురాలు శశికళ ఇపుడు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. జయ అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన విషయం తెల్సిందే. దీంతో బుధవారం కోర్టులో లొంగిపోగా, ఆ తర్వాత జైలుకు తరలించారు. 
 
అక్కడ ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నారు. దీంతో ఏదో ఒక పని ఎంచుకోవాల్సి ఉంది. శశికళ రోజు కూలీ రూ.50లుగా జైలు అధికారులు నిర్ణయించారు. ఈ ఆదివారం నుంచి పని కేటాయించనున్నారు. పని ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని అధికారులు ఆమెకే వదిలేశారు. 
 
సాధారణ ఖైదీలు మాదిరిగానే ఇద్దరు.. ముగ్గురు ఖైదీలు ఉండే సెల్‌లోనే శశికళను ఉంచనున్నారు. జైలు నిబంధనల ప్రకారం... ఉదయం 6.30 గంటలకు అల్పాహారం, 11.30 గంటలకు భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, రాత్రి 7 గంటలకు భోజనం అందిస్తారు. శశికళ ప్రత్యేక దుస్తులు ధరించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె జైలు దుస్తులనే ధరించారు. 
 
జైల్లో శశికళకు ఏసీ రూమ్‌, వేడినీళ్లు, ఇంటి భోజనం, సహాయకురాలిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని అమె తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. శశికళ గతంలో ఈ కేసుకు సంబంధించి ఆరు నెలలు ఇదే జైల్లో ఉన్నారు. అపుడు జయలలిత వెంట ఉండటంతో ఆమెకు వీఐపీ సౌకర్యాలు లభించాయి. కానీ, ఇపుడు సాధారణ ఖైదీ కావడంతో ఇవేమీ దక్కలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments