Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జైల్లో ఉండలేను.. చెన్నైకు తరలించేలా చర్యలు తీసుకోండి : లాయర్లతో శశికళ

దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్నారు. ఈ జైల్లో ఓ సాధారణ ఖైదీలా ఆమె కాలం వెళ్లదీస్తున్నారు.

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (13:45 IST)
దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్నారు. ఈ జైల్లో ఓ సాధారణ ఖైదీలా ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, ఈ జైలులో తాను ఉండలేనని, కటిక నేలపై పరుండలేనని, జైలు భోజనం భుజించలేనని ఆమె తనను కలిసిన కుటుంబ సభ్యుల వద్ద వాపోతుంది. అంతేకాకుండా తక్షణం తన లాయర్ల ద్వారా చెన్నై జైలుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో శశికళ తరపు న్యాయవాదులు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు.
 
ఇందుకు సంబంధించి ఇప్పటికే న్యాయపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆమె తరపు న్యాయవాదులు దృష్టిపెట్టారు. పరప్పణ అగ్రహార జైలు సూపర్‌డెంట్‌కు లాయర్లు తమ వాదనను వినిపించనున్నారు. అంతేకాదు, కర్ణాటక న్యాయశాఖ మంత్రితో కూడా శశికళ జైలు మార్పు విషయమై లాయర్లు చర్చించనున్నారు.
 
అయితే శశికళను చెన్నై జైలుకు తరలించేందుకు అనుమతినిచ్చే అవకాశాలు చాలాచాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కేసు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం. పైగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు... అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉండదు. 
 
ఈ విషయమై శశికళ తరపు లాయర్ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా శశికళను చెన్నై జైలుకు తరలించే అవకాశాలు లేవని ఆమె తరపు న్యాయవాది స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

సామాజిక బాధ్యత వున్న పాత్రలంటే ఇష్టం : ఐశ్వర్య రాజేష్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రామ్ చరణ్ 10లక్షలు సాయం

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments