Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ పుష్ప, భర్త, కుమారుడికి ఊరట.. లైంగిక దాడి కేసు వాపస్ తీసుకున్న పనిమనిషులు

అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలకన్, కుమారుడు ప్రదీప్ రాజాలపై నమోదైన అత్యాచారయత్నం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు యువతులు వెల్లడించారు. శశికళ పుష్ప ఇంట ప

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (09:32 IST)
అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలకన్, కుమారుడు ప్రదీప్ రాజాలపై నమోదైన అత్యాచారయత్నం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు యువతులు వెల్లడించారు. శశికళ పుష్ప ఇంట పనిచేసిన ఇద్దరు యువతులు అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ తమపై అత్యాచారయత్నంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ప్రస్తుతం వాపస్ తీసుకోవడంతో కేసు మలుపు తిరిగింది. ఈ మేరకు తమ ఫిర్యాదులు వాపసు చేసుకుంటున్నట్లు బుధవారం తూత్తుకుడి ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు.
 
ఇకపోతే.. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివపై దాడి జరిపిన శశికళ పుష్పను దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలోనే శశికళ పుష్ప ఇంట పనిచేసిన ఇద్దరు అక్కాచెలెళ్లు కూడా తమపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నానికి శశికళ భర్త, కుమారుడు పాల్పడ్డారని కేసు నమోదు చేసారు. ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు శశికళ పుష్ప కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి పనిమనుషులుగా పనిచేసిన ఆ అక్కాచెల్లెళ్లు.. కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం