Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళనిస్వామి ఔట్! తదుపరి ముఖ్యమంత్రిగా దినకరన్? : అన్నాడీఎంకే ఎమ్మెల్యే తంగదురై

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీటీవీ దినకరన్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎడప్పాడి కె. పళనిస్వామితో రాజీనామా చేయించి ఆయన స్థానంలో దినకరన్‌ను సీఎంగా చేయాలన్న తలంపులో ఆ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (09:17 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీటీవీ దినకరన్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎడప్పాడి కె. పళనిస్వామితో రాజీనామా చేయించి ఆయన స్థానంలో దినకరన్‌ను సీఎంగా చేయాలన్న తలంపులో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఉన్నట్టు తెలుస్తోంది 
 
దిండుగల్‌ జిల్లా నెలకోట్టై ఎమ్మెల్యే తంగదురై 5వ తేదీ నుంచి నియోజకవర్గంలో కనిపించలేదు. ఈపరిస్థితుల్లో మంగళవారం గట్టి పోలీసు భద్రత నడుమ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు, పార్టీ నిర్వాహకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు తెలిపానన్నారు.
 
ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఎంపిక తర్వాత నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చానన్నారు. అయితే తాను పోలీసుల భదత్ర కోరలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలోనే దినకరన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే తరుణం త్వరలోనే వస్తుందని తంగదురై తెలిపారు. దీంతో ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి పదవిని కోల్పోయే అవకాశమున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments