Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ... జయలలిత స్థానాన్ని ఆక్రమించిన చిన్నమ్మ

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (10:17 IST)
తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. 
 
ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును ప్రతి పాదిస్తూ ఓ తీర్మానం చేశారు. దీనికి సర్వసభ్య సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇకపై ఆమె తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ నేతలు తప్పనిసరిగా కట్టుబడాల్సి ఉంటుంది. అలాగే, పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆమె ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. 
 
ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యేలు పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి శశికళను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరనున్నారు. అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టడంతో... ఆ పార్టీలో కొత్త శకం ప్రారంభమయినట్టైంది. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments