Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగ్జరీ అపార్టు‌మెంట్‌లో శశికళ... చేతిలో యాపిల్ ఐ ఫోన్...

ఆదాయానికి మంచి ఆస్తుల సేకరణ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలు బయట ఉన్న ఓ అపార్టుమెంట్‌లో సేదతీరుతున్నారట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర జైళ్ళ

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (10:14 IST)
ఆదాయానికి మంచి ఆస్తుల సేకరణ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలు బయట ఉన్న ఓ అపార్టుమెంట్‌లో సేదతీరుతున్నారట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర జైళ్ళ శాఖలో డీఐజీగా పని చేసిన రూప వెల్లడించారు. 
 
జైలులో శశికళ తీరును బహిర్గతం చేసినందుకు ఆమెను ఇటీవల జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేసిన విషయం తెల్సిందే. ఇపుడు ఈమె సంచలన విషయాన్ని బయటపెట్టారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శశికళ ఉండటం లేదని, జైలుకు సమీపంలో ఉన్న ఓ లగ్జరీ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. 
 
అపార్టుమెంట్ విషయం తనకు తెలిసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ వీలుపడలేదని అన్నారు. ఆమె స్వయంగా పట్టుబడివుంటే తాను తీసుకునే చర్యలు భయంకరంగా ఉండేవన్నారు. తన అరోపణలు రుజువైతే, శశికళకు ప్రస్తుతం విధించిన నాలుగేళ్ల శిక్షకు అదనంగా మరికొన్ని సంవత్సరాల శిక్ష తప్పదన్నారు. 
 
జైల్లో ఆమె ఒక్క పని కూడా చేయలేదని, యాపిల్ ఐ ఫోన్ వాడారని, ఒక్క రోజు కూడా జైలు ఆహారం తినలేదని ఆమె వెల్లడించారు. ఖైదీల యూనిఫాంను పక్కన బెట్టిన ఆమె, ఖరీదైన చీరలు, చుడీదార్లనే వాడినట్టు ఆరోపించారు. కాగా, గత వారం నుంచి శశికళకు కల్పించిన అదనపు సౌకర్యాలన్నీ తొలగిపోయినట్టు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments