Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళకు షాక్.. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు... సీఎం ఆశలు ఆవిరి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అంతేకాదు, రూ.100 క

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (10:52 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అంతేకాదు, రూ.100 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. మరికొద్దిసేపట్లో ఆమెను జైలుకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇన్నాళ్లుగా సీఎం పదవిపై చిన్నమ్మ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. 
 
ఆమెకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లో నైరాశ్యం నెలకొంది. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వంకు జై కొట్టేందుకు ఆమె వర్గంలోని ఎమ్మెల్యేలంతా సిద్ధమయ్యారు. అయితే శశికళ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. తన మేనల్లుడి దీపక్‌ని తెరపైకి తేవాలని శశికళ భావించారు. అయితే, పెక్కు మంది ఎమ్మెల్యేలు అందుకు అంగీకరించలేదు. 
 
ఇదిలావుండగా, పోయెస్‌గార్డెన్‌లో ఉంటున్న శశికళ కుటుంబ సభ్యులు పన్నీరు సెల్వం సీఎం అయిన మరుక్షణం ఖాళీ చేయించనున్నారు. ఆయన ప్రకటించినట్లుగా పోయెస్ గార్డెన్‌లోని జయ నివాసమైన వేద నిలయాన్ని స్మారకంగా మార్చనున్నారు. ఇదిలావుంటే, ఆమె అనుచరులు కోర్టు తీర్పును తప్పుబడుతున్నారు. కేంద్రం ఆడిన నాటకంలో శశికళను బలిపశువును చేశారని ఆరోపిస్తున్నారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శశికళ వర్గం సిద్ధమైంది. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన హోం శాఖ పోలీసు శాఖను సమాయత్తపరిచింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే చెన్నైలో పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే, కోర్టు వెల్లడించిన తీర్పుపై పన్నీరు సెల్వం వర్గం హర్షం వ్యక్తం చేసింది. ధర్మ యుద్ధంలో అన్యాయం ఎన్నటికీ పైచేయి సాధించడనడానికి సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనమని పన్నీరు పంచన చేరిన నేతలు చెప్పుకొస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments