Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్నటివరకు ముఖ్యమంత్రి.. ఇకపై ఉప ముఖ్యమంత్రి? ఇదీ 'త్యాగయ్య' పన్నీర్ పరిస్థితి

నిన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.. ఇకపై ఉప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఆయన ఎవరో కాదు.. సీఎం పదవిని తృణప్రాయంగా త్యజించడంలో త్యాగయ్యగా పేరును సార్థకం చేసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీ

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (18:27 IST)
నిన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.. ఇకపై ఉప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఆయన ఎవరో కాదు.. సీఎం పదవిని తృణప్రాయంగా త్యజించడంలో త్యాగయ్యగా పేరును సార్థకం చేసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం. 
 
మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమె మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. కీలకమైన ఆర్థిక శాఖను పన్నీర్‌కు కట్టబెట్టాలని శశికళ నిర్ణయించినట్టు పోయస్ గార్డెన్ వర్గాల సమాచారం. 
 
మరోవైపు... మద్రాసు విశ్వవిద్యాలయంలోని సెంటినరీ ఆడిటోరియంలో శశికళ మంగళవారం ఉదయం 8.45 గంటలకు ప్రమాణం చేయనున్నారు. తద్వారా తమిళనాడు రాష్ట్ర చరిత్రలో మూడో ముఖ్యమంత్రిగా శశికళ రికార్డుపుటలకెక్కనున్నారు. 
 
అదేసమయంలో శశికళ కోసం మరోసారి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన పన్నీర్‌ సెల్వానికి సముచిత పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్నారని, శశికళ కేబినెట్‌లో పన్నీర్‌ సెల్వానికి కీలక ఫోర్టుపోలియో అయిన ఆర్థిక శాఖ దక్కే అవకాశముందని వినిపిస్తోంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments