Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ ఎప్పుడైనా సీఎం బాధ్యతలు స్వీకరించవచ్చు.. 12 లేదా 18 తేదీల్లో..?: మైత్రేయన్

అన్నాడీఎంకే సారథి, దివంగత ముఖ్యమంత్రి నెచ్చెలి శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రోజులు దగ్గరపడుతున్నట్లున్నాయి. శశికళ ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం బాధ్యతలు స్వీకరించవచ్చునని పార్టీ ప్రతినిధి, ఎంపీ మైత

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (12:50 IST)
అన్నాడీఎంకే సారథి, దివంగత ముఖ్యమంత్రి నెచ్చెలి శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రోజులు దగ్గరపడుతున్నట్లున్నాయి. శశికళ ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం బాధ్యతలు స్వీకరించవచ్చునని పార్టీ ప్రతినిధి, ఎంపీ మైత్రేయన్ తెలిపారు. 
 
ఇండియాటుడే సౌత్ కాన్‌క్లేవ్‌లో సందర్భంగా మైత్రేయన్ మాట్లాడుతూ.. ఈ నెల 12 లేదా 18న శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే సంప్రదాయం ప్రకారం... పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి జనరల్ సెక్రటరీగా ఉన్నవారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వచ్చారు. ఇదే తరహాలో శశికళ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
ఇక ముఖ్యమంత్రి పీఠంపై ఎప్పుడు కూర్చుంటారన్నది చిన్నమ్మ (శశికళ) ఇష్టం. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు బాధ్యతలు చేపట్టవచ్చు. ఇందులో తాము చెప్పేందుకు ఏమీ లేదని మైత్రేయన్ వ్యాఖ్యానించారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments