Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు హత్య : ఆరుగురికి మరణశిక్ష

తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిని అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుల్ల

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (16:33 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిని అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుల్లో ఆరుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మంగళవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
గత యేడాది మార్చి 13వ తేదీన ఉడుమల్‌పేట్ బస్‌స్టాండ్‌కు సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేసి వస్తున్న శంకర్ దంపతులపై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య కౌశల్య కొన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స కోలుకుంది. 
 
ఈ హత్య కేసుకు సంబంధించి వీడియో ఫూటేజీ ఆధారంగా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తిరుపూరు జిల్లా సెషన్సు కోర్టులో జరిగింది. మొత్తం 1500 పేజీల చార్జిషీటును పరిశీలించిన న్యాయమూర్తి అలమేలు నటరాజన్ మంగళవారం తుది తీర్పును వెలువరించారు. 
 
మొత్తం 11 మందిలో ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవిత ఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు శంకర్ భార్య కౌసల్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments