Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి కుమార్తె వెడ్డింగ్ కార్డుపై సంపూర్ణేష్ పోస్ట్.. వెంటనే డిలీట్ చేశాడు ఎందుకు..? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

మైనింగ్ వ్యాపార వేత్త‌, రిచెస్ట్ పొలిటీషియ‌న్ గాలి జ‌నార్ధ‌న‌రెడ్డి త‌న కూతురు వివాహ నిమిత్తం వార్త‌ల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. త‌న కుమార్తె మ్యారేజ్‌ ఘనంగా చేయాలని ప్ర‌ణాళిక‌లు చేస్తున్నాడు. తాజాగ

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (09:00 IST)
మైనింగ్ వ్యాపార వేత్త‌, రిచెస్ట్ పొలిటీషియ‌న్ గాలి జ‌నార్ధ‌న‌రెడ్డి త‌న కూతురు వివాహ నిమిత్తం వార్త‌ల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. త‌న కుమార్తె మ్యారేజ్‌ ఘనంగా చేయాలని ప్ర‌ణాళిక‌లు చేస్తున్నాడు. తాజాగా గాలి కుమార్తె నిశ్చితార్ధం బెంగుళూరులో నిర్వ‌హించ‌గా.. పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా అంద‌రూ ఔరా అనుకునేట్టు చేయాల‌ని ఆయన భావిస్తున్నాడట. ఈ పెళ్లి బళ్లారిలోనే కాదు, సౌత్‌లో అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిపోవాలని ఆయన ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. అంతేకాదు... నవంబర్ 16న జ‌రిగే వివాహ వేడుకల్లో సినీ యాక్ట‌ర్ల‌తో లైవ్ షోలు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇప్పించేందుకు గాలి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యంపై హాజ‌ర‌య్యేందుకు ఇప్పటికే షారూక్, కత్రినా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చార‌ని తెలిసింది. 
 
ఈ పెళ్లికి దేశంలోఉన్న‌ ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నాయ‌కులు కూడా హాజ‌ర‌వుతున్న‌ట్టు సమాచారం. కుమార్తె పెళ్లి అంద‌రికీ గుర్తుండిపోయేలా 11 రోజులు వివాహ వేడుక‌లు జ‌రిపి రికార్డు సృష్టించేందుకు ఆయ‌న రెడీ అవుతున్న‌ట్టు సన్నిహితులు అంటున్నారు. తన కుమార్తె పెళ్లికి ప్రముఖులను ఆహ్వానించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన కొందరు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు కూడా ఆహ్వాన పత్రికను అందించారు. ఈ విషయాన్ని సంపూ తన ఫేస్‌బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. 
 
గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె పెళ్లి శుభలేఖ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ కుటుంబం తనపై చూపించే ప్రేమాభిమానాలకు తానెప్పుడూ బానిసనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ, ఆ తర్వాత ఈ పోస్టు కనిపించలేదు. రాత్రికిరాత్రే ఆ పోస్టును సంపూ డిలీట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సంపూ దానిని ఎందుకు తొలగించి ఉంటాడన్న దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments